Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రిల దోపిడీపై విచారణ చేయాలి

తల్లీ కూతుళ్ళ మరణానికి కారణమైన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి
సీపీఐ, ఏఐటీయూసీ డిమాండ్

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లాలో ప్రైవేటు ఆసుపత్రిల డాక్టర్లు వివిధ రోగాలు పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న తీరుపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి సీపీఐ కోరంగి మన్మధరావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఆర్ వి ఎస్ కుమార్ లు తెలిపారు. సోమవారంనాడు జియ్యమ్మమండలంలోని బట్లభద్ర గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లికూతుల్లు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పార్వతీపురంలో ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లికూతుళ్ళు వారంరోజులపాటు చికిత్స పొంది చివరలో రిఫరల్ చేయగా శ్రీకాకుళం విజయనగరం తరలించి మరణానికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో చాలా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ తెల్లకార్డు కలిగినవారినుండి ఆసుపత్రిలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఫీజులు పేరిట, టెస్టుల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేయడంపై విచారణ చేయాలన్నారు. పార్వతీపురం కేంద్రంలో ఆరోగ్యశ్రీ ఉండే ఆసుపత్రిలో
ఏఏ రోగాలకు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్నారో తెలియజేసే పట్టికలు కూడాలేవన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నట్లు కూడా రోగులకు తెలియజేసే పరిస్థితి లేదన్నారు.ప్రైవేట్ ఆస్పత్రిలో చేరుతున్న రోగులనుండి లక్షలాది రూపాయలు తీసుకోవడమేగాక పలువురుని రిపర్ చేయడం, పలువురు మృతి
చెందిన ఆవివరాలు ప్రభుత్వానికి తెలియజేసే దాఖలాలు లేవని వారి తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలలో జరుగుతున్న మృతులపై కూడా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సీతంపేట, చిన మేరంగి ఏరియా హాస్పిటల్ తో పాటు మండల కేంద్రాల్లో ఉండే ఆసుపత్రిలో కూడా సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని మందులు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైన సేవలు అందకపోవడంతోనే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రకరకాల రోగాలు పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారన్నారు. డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ వ్యాధులతోపాటు ప్లేట్లెట్లు తగ్గిపోయాయని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేయడం దీనిపై నియంత్రణ చేసే అధికారులు అధికారులు లేకపోవడం వలన ప్రజలు మానసికంగా ఎంతో ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. బట్లబద్రలోజరిగిన తల్లి కూతుర్ల మరణానికి కారణమైన ఆసుపత్రి వైద్యుల పైన, దీనికి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలలో జరుగుతున్న దోపిడీపై సిపిఐ, ఏయుటియుసిలు పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులుసింహాద్రి దుర్గారావు, గరుగుబిల్లి సూరయ్య,గోపి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img