మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రశాంతతకు పేరొందిన ధర్మవరంలో దౌర్జన్యకర సంస్కృతికి బీజం వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ సాయంత్రం జరిగిన సంఘటనపై పలు విషయాలను తెలియజేశారు. మూడు నెలల్లో మంత్రి సత్య కుమార్ అనుచరులు కూటమి పార్టీల నాయకులు దండాలు, దౌర్జన్యాలను త్వరలో బయటపెడతానని వారు తెలిపారు. తాను వైఎస్ఆర్సిపి శ్రేణులను పరామర్శించేందుకు తాను ఐదుగురితో కలిసి సబ్ జైలు వద్దకు వెళ్లాలని ఆ సమయంలో మంత్రి అనుచరులు తన డ్రైవర్ రామాంజి పై దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని తెలిపారు. సబ్ జైలు వద్దనే పోలీసులు ఉన్నా కూడా వీరంగం చేయడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. దివ్యాంగుడు అనారోగ్యంతో ఉన్న అమర్నాథ్ రెడ్డి ని విజయ్ ని దారుణంగా కొట్టడం జరిగిందని తెలిపారు. న్యూస్ కవరేజ్ కు వెళుతున్న రమేష్ పై కూడా పోలీస్ లాఠీలతో కొట్టడం పద్ధతేనా? అని ప్రశ్నించారు. ధర్మవరంలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంత్రి సత్య కుమార్ తగిన గుణపాఠం చెబుతున్నారని తెలిపారు. తాను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను అదుపులో ఉంచడం జరిగిందని, మరి ఇప్పుడు అదే తప్పని తేలిందని కేతిరెడ్డి స్పష్టం చేశారు. కూటమినేతలకు అతి త్వరలో తగిన సమయంలో సమాధానం చెబుతామని వారు హెచ్చరించారు. ఇకనుంచి ధర్మవరంలో దౌర్జన్య కాండను సహించేది లేదని తెలిపారు.