రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు
విశాలాంధ్ర- ధర్మవరం:: కలకత్తాలోని డాక్టర్ ఇంటికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్బు వారు మానవ హక్కుల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు బాలికల పాఠశాలలు, కళాశాలలో డాక్టర్ మృతికి వివరాలను తెలియజేస్తూ డాక్టర్ కు సంతాపాన్ని తెలిపారు. అనంతరం పట్టణ పురవీధులలో విద్యార్థులు విద్యార్థినీలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు జయ సింహ, కార్యదర్శి నాగభూషణ, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు నాగరత్నమ్మ లు మాట్లాడుతూ ప్రజలకు ప్రాణాలను నిలుపుదల చేసే డాక్టర్లపై ఇటువంటి కిరాతకమైన చర్య కు పాల్పడటం నిజంగా దారుణమని, చాలా బాధాకరమని తెలిపారు. దేశవ్యాప్తంగా డాక్టర్ మృతి పట్ల సంతాప నిరసనలు కూడా తెలియజేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా డాక్టర్లకు రక్షణ, భద్రత ఇస్తూ, ప్రత్యేకమైన చట్టాలను తీసుకొని రావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రమేష్, శివయ్య, ఇన్నర్ వీల్ క్లబ్ పర్వీన్, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, హ్యూమన్ రైట్స్ పవన్, శామీర్ తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థినిలతోపాటు రోటరీ హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు.