విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణములోని గాంధీ నగర్ లో గల చౌడేశ్వరి తొగట వీర క్షత్రియ కళ్యాణ మండపములో పట్టణ కుల బాంధవుల సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో తొగట వీర క్షత్రియ సంఘం పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇందులో పట్టణ అధ్యక్షుడిగా గుద్దిటి రాము, ప్రధాన కార్యదర్శిగా గూడా పుల్లయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. తదుపరి తోకటవీర క్షత్రియ కుల బాంధవులు, సంఘం నాయకులు నూతన కమిటీ వారిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన కమిటీ వారు మాట్లాడుతూ తొగట వీర క్షత్రియ సంఘం కు నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధి బాటలో నడుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తొగట వీర క్షత్రియ కుల బాంధవులు పాల్గొన్నారు.