ధర్మవరం ఎమ్మెల్యే,మంత్రి వై.సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర -ధర్మవరం : విజయవాడలోని తన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే వై.సత్య కుమార్ యాదవ్, మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి వారు చేసిన సేవలు మరువలేనివి అంటూ కొనియాడారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయని తెలిపారు. వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని వారు తెలిపారు.