విశాలాంధ్ర- ధర్మవరం: శ్రీ బాలాజీ విద్యాసంస్థల మాజీ చైర్మన్ కీర్తిశేషులు పల్లె ఉమా సేవలు మరుపురానివని శ్రీనివాస డిగ్రీ కళాశాల పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ముసలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉమా ఆరవ వర్ధంతి వేడుకలను విద్యార్థుల సమక్షంలో నిర్వహించుకున్నారు. తదుపరి వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం వహించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు. అనంతరం ముసలి రెడ్డి మాట్లాడుతూ కీర్తిశేషులు ఉమా ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, పేదలను ఆదుకోవడం కూడా జరిగిందని తెలిపారు. అనంతరం మండల పరిధిలోని గోట్లురు గ్రామంలో గల అనాధశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.