మర్యాద పూర్వకంగా కలిసిన పోలీసు అధికారులు
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ని జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణలు నూతన ఎస్పీకు పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద స్వాగతించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డీఎస్పీలు టి.వి.వి ప్రతాప్, రవికుమార్, శివభాస్కర్ రెడ్డి, జనార్ధన్ నాయుడు, బి.వి.శివారెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఓ శంకర్ మరియు సి.ఐ లు ధరణీకిశోర్, ఇస్మాయిల్, షేక్ జాకీర్, ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ఆర్ ఐ రాముడు, లీగల్ అడ్వయిజర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్పీ సి.సి ఆంజనేయ ప్రసాద్, సూపరింటెండెంట్లు, గోపికృష్ణ, ప్రసాద్, సావిత్రమ్మ, శివ, తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.