విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం కు నూతన ఆర్డీవో గా ఏ. మహేష్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. వీరు స్వగ్రామం చిత్తూరు జిల్లా, నగిరి మండలం. 2022 బ్యాచ్ లో డిప్యూటీ కలెక్టర్గా గ్రూప్ వన్ గా ఎంపిక కాబడ్డారు. అదేవిధంగా మూడు నెలలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా అనకాపల్లి జిల్లాలో విధులు కొనసాగించారు. తదుపరి ఏడు నెలలు విజయవాడ అడిషనల్ కమీషనర్ గా గా విధులు కొనసాగిస్తూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం ఆర్డిఓ గా బదిలీగా వచ్చారు. అనంతరం ప్రస్తుత ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, కార్యాలయ సిబ్బంది నూతన ఆర్డీవోకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్డిఓ మహేష్ కార్యాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి, వారితో పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, రెవిన్యూ డివిజన్లో ఉండే ప్రతి సమస్యకు అనుకున్న షెడ్యూల్ తేదీలు ప్రకారం పరిష్కారం చూపాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం చేయవచ్చు వివిధ పథకాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని తెలిపారు. రెవెన్యూ డివిజన్ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలతో రెవెన్యూ విభాగమును అభివృద్ధి బాటలో నడుపుతారని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా విధులు ఉద్యోగులు నిర్వర్తించాలని తెలిపారు. తదుపరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు అందజేశారు.