వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ ఆరవ రోజుకు చేరుకుంది. నేడు మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేమురు వద్ద షర్మిల ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 20వ తేదీన షర్మిల రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.