ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.గౌతమ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌతమ్ రెడ్డితో తనకు 12 ఏండ్లుగా పరిచయం ఉందన్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు గౌతమ్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.