హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి బలుమూరి వెంకట్ కంటే కూడా స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీకి 119 ఓట్లు రాగా, ప్రజా ఏక్తా పార్టీకి 122 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 220, ప్రజా ఏక్తా పార్టీకి 158 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 107, శ్రీకాంత్‌కు 43 ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండటం పెద్ద కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.