సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువ కప్పిన సీఎం కేసీఆర్..పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. యువనేత కౌశిక్ రెడి ్డ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కౌశిక్‌రెడ్డి ఆయన అనుచరులను సాదరంగా తెరాసలోకి ఆహ్వానిస్తున్నాను అన్నారు. మలిదశ ఉద్యమంలో కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి తనతో కలిసి ఉద్యమంలో పనిచేసినట్లు సీఎం చెప్పారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమాలు కొనసాగించామని, ప్రొ.జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపామన్నారు.