Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జర్నలిస్టుల డిమాండ్లపై త్వరలో చలో దిల్లీఐజేయూ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో నిర్ణయం

హైదరాబాద్‌/ చండీగఢ్‌: వర్కింగ్‌ జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి దిల్లీలో త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమం చేపట్టాలని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) నిర్ణయించింది. హర్యానాలోని పంచకులలో ఆగస్టు 3-4 తేదీలలో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలలో మీడియా స్వేచ్ఛ పరిరక్షణ, మీడియా స్థితిగతులు, జర్నలిస్టుల భద్రత వంటి విషయాలపై సమగ్రంగా చర్చ జరిగిందని అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ బల్విందర్‌ సింగ్‌ జమ్మూ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. చండీగఢ్‌, హర్యానా జర్నలిస్ట్‌ యూనియన్‌ ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. దేశంలో మీడియా రంగంలో సాంకేతికత పెరగడం, కృత్రిమ మేధను వినియోగించడం, డిజిటల్‌ మీడియా విస్తరణ నేపథ్యంలో మీడియా స్థితిగతుల అధ్యయనానికి మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐజేయూ చిరకాలంగా డిమాండ్‌ చేస్తున్నదని అయితే ప్రభుత్వం తమ డిమాండును పెడచెవిన పెడుతున్నదని ఆ ప్రకటనలో వారు విచారం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులపై దాడుల నిరోధానికి ప్రత్యేకచట్టం తేవాలని, వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యాక్ట్‌ను, వేజ్‌ బోర్డ్‌ను, రైల్వే రాయితీ పాస్‌ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, ప్రెస్‌ కౌన్సిల్‌ను మీడియా కౌన్సిల్‌గా మార్చాలని చాలా కాలంగా ఐజేయూ డిమాండ్‌ చేస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. జర్నలిస్టులు దశలవారీగా దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోవడంతో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని ఐజేయు జాతీయ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించిందని శ్రీనివాస్‌ రెడ్డి, బల్విందర్‌ సింగ్‌ జమ్మూ ఆ ప్రకటనలో తెలిపారు. త్వరలో నిర్వహించనున్న చలో దిల్లీ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి జర్నలిస్టులను సమీకరించాలని ఐజేయూ సమావేశం నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ‘‘చలో ఢల్లీి’’ కార్యక్రమం జరిపే తేదీని ఐజేయూ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వారు వెల్లడిరచారు. ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో 18 రాష్ట్రాలకు చెందిన రెండువందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరు ప్రధాన డిమాండ్లపై జాతీయ కౌన్సిల్‌ సమావేశం తీర్మానాలను ఆమోదించింది. దేశంలో జర్నలిస్టులపైన, మీడియా సంస్థల మీద దాడులు పెచ్చరిల్లడంపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టుల రక్షణకు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేయడంపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. జాతీయస్థాయిలోనూ, రాష్ట్రాలలోనూ వెంటనే ఇటువంటి చట్టాలు తేవాలని ఒక తీర్మానంలో ఐజేయూ డిమాండ్‌ చేసింది. కార్మిక చట్టాల కోడిఫికేషన్‌ పేరిట రద్దు చేసిన వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యాక్ట్‌ను, వేజ్‌ బోర్డును, పునరుద్ధరించాలని మరో తీర్మానంలో ఐజేయూ డిమాండ్‌ చేసింది. దేశంలో బలమైన వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఉద్యమాన్ని నిర్మించడపై యూనియన్‌ కేంద్రీకరించి పనిచేస్తున్నదని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img