డ్రగ్స్ నియంత్రణకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసుశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తోంది.హర్యానా రాష్టాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ సెల్ చేస్తున్న చర్యలను పరీశీలిస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ, పోలీసుశాఖ సమన్వయంతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ప్రతి జిల్లాలో ఒక నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. త్వరలోనే స్పెషల్ టీమ్ ఏర్పాటుకు విధివిధానాలు, కార్యాచరణను డీజీపీ నివేదిక రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్నారు. 1000 మందితో స్పెషల్ నార్కోటిక్ సెల్?టీమ్ ఏర్పాటుకు పోలీస్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. డ్రగ్స్ నియంత్రణకు ఇతర రాష్టాల్లో తీసుకుంటున్న చర్యలపై అధికారులు ఆరా తీస్తున్నారు.