టీఆర్‌ఎస్ పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులు చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గులాబీ కండువాను కప్పుకునేందుకు రెడీ అయిపోయారు.తన అనుచరులు, అభిమానులతో టీఆర్‌ఎసలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దళిత ఓటర్లపై సీఎం దృష్టి సారించడం, దళితబంధు వంటి ప్రతిష్ఠాత్మక పథకం తీసుకురావడం, ఉమ్మడి నల్లగొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి వారి ప్రకటనలకు ధీటుగా సమాధానం ఇవ్వడం తదితర అంశాల ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ నేత మోత్కుపల్లిని పార్టీలోకీ తీసుకునే అంశం లో సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.