పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. వాస్తవానికి జనవరి 29వరకు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండగా దాన్ని ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. ఆలస్య రుసుములతో మార్చి 14 వరకు చెల్లించే అవకాశమిచ్చింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆ ప్రకారం, మే 20వ తేదీ తర్వాత మొదలవుతాయి.