: పోలీసు శాఖ
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు డోపమ్ యాప్‌ను పోలీసులు రూపొందించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఇవాళ డ్రగ్స్ వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ కీలక ప్రతిపాదనలను సిద్ధం చేశారు. డ్రగ్స్ విక్రయదారులు, వినియోగదారుల చిట్టాను పోలీసులు సిద్ధం చేశారు. గతంలో డ్రగ్స్ తీసుకున్నవారి పేర్లతో చిట్టాను రూపొందించారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు సంబంధించిన పేర్లతో చిట్టా తయారయింది. గంజాయి తీసుకున్నవారి వివరాలనూ పోలీస్‌శాఖ పొందుపర్చింది.డ్రగ్స్‌కు సంబంధించి గత పదేళ్ల డేటాను పోలీస్ శాఖ తయారు చేసింది.