తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పేయడంతో రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు.. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారులపై ఈ మంచు దుప్పటి విపరీతంగా కప్పేస్తుంది. జనగాం జిల్లాలో తెల్లవారు జాము నుండి ఈ చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయి పడిపోతున్నాయి. పొగమంచుతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మంచు దుప్పటితో కప్పేస్తుంది. వాహనదారులు రహదారి కానరాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.