తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు.ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలోని మరికల్‌లో అత్యధికంగా 70.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.