బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు
దళితబంధుపై హుజురాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు సవాల్ విసిరారు.దళితులకు మూడెకరాల భూమి మాదిరే … దళితబంధు పథకం కూడా అని అన్నారు. తమకు పది లక్షలు ఇచ్చే ఆలోచన కేసీఆర్‌కు లేదని హుజురాబాద్ ప్రజలే మట్లాడుకుంటున్నారని అన్నారు. దళితబంధును ఆపమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మానాభరెడ్డి ఈసీకి ఆగస్టులోనే లేఖ రాశారన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా ఎందుకు ఫ్రీజ్ చేశారో కేటీఆర్ చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని తేలటం వలనే కేటీఆర్ హుజురాబాద్‌లో ప్రచారానికి రావటం లేదని అన్నారు.