హుజూరాబాద్‌లో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాగా ఆయన ఆ నియోజకవర్గంలోని ఘున్ముక్ల పోలింగ్ కేంద్రం వద్దకు రాగా స్థానికేతరులకు ఇక్కడ ఏం పని అంటూ బీజేపీ శ్రేణులు నిలదీశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కౌశిక్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘున్ముక్లలాగే వీణవంక పోలింగ్ కేంద్రం వద్ద కూడా కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. ‘నేను టీఆర్‌ఎస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నా. నాకు రాజ్యాంగం ప్రకారం 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. నా వెనుక టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ లేరు. అయినా బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు? కేవలం ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్‌తోనే బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు’ అని మండిపడ్డారు.