నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖంపట్టింది. దీంతో అధికారలు ప్రాజెక్టు క్రస్టు గేట్లను మూసివేశారు. సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 58,130 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 48,908 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.90 అడుగుల వద్ద ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా, 311.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది.