asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

నాడు కిసాన్‌లు నేడు జవాన్లు

కేంద్రంపై కేటీఆర్‌ ఘాటు విమర్శలు
అగ్నిపథ్‌ స్కీంపై జరుగుతున్న అల్లర్ల దేశంలో నిరుద్యోగుల ఆగ్రహానికి నిదర్శనం మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాడు రైతులను టార్గెట్‌ చేసుకున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు జవాన్లను టార్గెట్‌ చేసుకుందని విమర్శించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. దీనంతటికీ మోదీ ప్రభుత్వం సమధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు దేశ అన్నదాతల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడేమో దేశ జవాన్లతో ఆడుకుంటున్నారు. మొన్న ‘ఒకే ర్యాంక్‌ఒకే పింఛను విధానం’..నేడు ‘ర్యాంకు లేదుపింఛను లేదు’ అనే ప్రతిపాదన’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. యువకుల గోడు వినాలంటూ ఓ వ్యక్తి చేసిన కామెంట్‌ను కేటీఆర్‌ రీ ట్వీట్‌ చేశారు. దేశానికి సేవ చేయాలని సిద్ధంగా ఉన్న యువతతో ఎందుకిలా ఆడుకుంటున్నారని నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img