: మంత్రి ఎర్రబెల్లి
అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలు, మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో రూ.116 కోట్ల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని, వీటిలో 19,413 (99.9%) పూర్తి చేశామని తెలిపారు. మండల కేంద్రంలో భూమి లేనిచోట మేజర్ పంచాయతీలో పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.