పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిరదని, సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. 1959 భారత్, చైనా సరిహద్దుల్లో దేశ భద్రతకు ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులకు నివాళులు అర్పిస్తూ అక్టోబర్ 21 తేదీన అమరవీరుల దినోత్సవం జరువుకుంటున్నామని తెలిపారు. విధి నిర్వహణలో 377 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారందరికీ నివాళులర్పించామని తెలిపారు. టెర్రరిజం, నక్సలిజంను అరికట్టడంలో పోలుసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారన్నారు. టెక్నాలజీ ఉపయోగించి శాంతి భద్రతలను కాపాడుతున్నామన్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడిరచారు. కొవిడ్ సమయంలో పోలీసులు అత్యుత్తమ సేవలు అందించారని చెప్పారు. కొవిడ్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పిస్తున్నట్టు డీజీపీ తెలిపారు