హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్‌ఎస్ ఆధిక్యంలో నిలిచింది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి.పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.