సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం, సోమవారం ఆంక్షలు విధించారు. పొగాకు బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు.బాటా క్రాస్ రోడ్ నుండి ప్రారంభమయ్యే సుభాష్ రోడ్ నుండి రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వరకు హవానాల రాకపోకలను నిషేధించారు. అదేవిధంగా అదవయ్య క్రాస్ రోడ్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్ళే రహదారి, జనరల్ బజార్ నుండి ఆలయానికి వెళ్ళే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు.