తెలంగాణలో మూడురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు ఉండగా.. 642 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తి 3,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి వరదనీరు జలాశయాల్లోకి చేరుతోంది.