వనపర్తిలోని మణిగిల్ల గ్రామంలో అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాసులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని చెప్పారు. మన ఊరు
మన బడితో రాష్ట్రంలోని పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.కరెంట్, మరుగుదొడ్లు, ప్రహారీగొడలు, ల్యాబ్, డిజిటలైజేషన్, కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలలలో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎంపీపీ మేగారెడ్డి వితరణతో మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ చేశారు.