బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు (బుధవారం, గురువారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 13 సెం. వర్షపాతం నమోదవ్వగా.. అశ్వరావుపేట 11 సెంటీమీటర్లు, కానరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 సెంటీమీటర్లు, నర్మెట భూపాలపల్లి ఖానాపూర్ ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.