మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రాథమిక సభ్యత్వానికి నటుడు ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేశారు. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని, అతిథిగా వచ్చాను..అతిథిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నానని అన్నారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని తెలిపారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసిన నా నిర్ణయాన్ని ఆమోదించండి అని మంచు విష్ణుకు సందేశం పంపారు. అయితే దీనిపై మంచు విష్ణు బదులు ఇచ్చి, ఆ స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా లేను. దయచేసి తొందరపడొద్దు అంటూ విష్ణు పేర్కొన్నారు.