మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శనివారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, శాశ్వత ప్రాతిపదికన మేడారంలో పనులు చేపట్టినట్టు తెలిపారు. మేడారం మహాజాతరకు కోటి ముప్పై లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల అభిప్రాయాలకు గౌరవం ఇస్తామని, వారి సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా చూస్తామని..కానీ కొందరు జాతరను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.