Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మోదీ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

అవినీతి… అహంకారం… నియంతృత్వం ఉండకూడదు
పోరాట కేంద్రాలుగా కమ్యూనిస్టు కార్యాలయాలు
సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని

విశాలాంధ్ర బ్యూరో – భద్రాద్రి కొత్తగూడెం: రాజకీయాల్లో ఎప్పటికీ ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని, సామాన్య ప్రజలకు సైతం న్యాయం అందుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. దేశ ప్రజలు కూడా నేడు కమ్యూనిస్టులు అవసరాన్ని గుర్తిస్తున్నారని, కమ్యూనిస్టు కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా ఉండి ప్రజలకు సైతం భరోసా కల్పించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్‌ ఏరియాలోని సీపీఐ కార్యాలయాన్ని (రజబ్‌ అలీ భవన్‌) ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ జెండాను ఎగురవే శారు. కార్యదర్శి కార్యాలయాన్ని సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, చండ్ర సత్యం , సమావేశ మందిరాన్ని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. అనంతరం జరిగినసభలో నారాయణ మాట్లాడుతూ అవినీతి, నియంతృత్వం, అహంకార ధోరణులు నేటి రాజకీయాల్లో సహజమైపోయాయని, ఈ విధానాలు ఎప్పటికీ ఏ వ్యక్తికైనా, రాజకీయాల్లోనైనా ఎక్కువకాలం మనుగడ సాగించలేవని స్పష్టం చేశారు. సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే అమరజీవి రజబ్‌ అలీ కాలం నాటి రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. నిబద్ధత, పవిత్రమైన రాజకీయాలు నేడు అపహాస్యం పాలవుతున్నాయని, నరేంద్ర మోదీ పదేళ్ల కాలంగా ప్రతిపక్షాలపై బెదిరింపు, బ్లాక్‌ మెయిల్‌, నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తున్నారన్నారని దుయ్యబట్టారు. తెలంగాణ, ఏపీల్లో మోదీ తరహాలోనే అవినీతి, నియంతృత్వం, అహంకారానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రతిపక్షాలను అగౌరవ పరిచే సాంప్రదాయాన్ని మానుకోవాలని అధికార రాజకీయ నేతలకు నారాయణ హితవు పలికారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే తప్పిదాన్ని చేస్తోందని, తీరు మార్చుకోవాలని సూచించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజా తీర్పునకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పారు. ఎలాంటి పదవులు లేకున్నా కమ్యూనిస్టులు నిత్యం ప్రజలతోనే ఉంటారని స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజలు ఇప్పుడిప్పుడే కమ్యూనిస్టుల ఆవసరాన్ని గుర్తిస్తున్నారని అన్నారు. పవిత్రమైన రాజకీయ వ్యవస్థను కాపాడుకునేందుకు కమ్యూనిస్టులుగా పోరాటాలను మరింత పదునుపెట్టాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు.
సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేయడంతో దాదాపు 40 ఏళ్ల గా ఈ ప్రాంతం కమ్యూనిస్టుల కంచుకోటగా నిలిచిందన్నారు. ఎన్నో నిర్భంధాలు, జైళ్లు, అణచివేతలను తట్టుకుని నిలబడ్డామన్నారు. కొత్తగూడెం నియోజవర్గంలోని ప్రతి అభివృద్ధిలో సీపీఐ కృషి, పోరాటాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందని చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో శాశ్వత అభివృద్ధికి బాటలు వేసుకుందామని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే పార్టీల మనుగడ శాశ్వతమన్నారు. తమకు పదవుల కంటే ప్రజా శ్రేయస్సు ముఖ్యమని కూనంనేని స్పష్టం చేశారు. సీపీఐ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్‌ కె. సాబీర్‌ పాషా, పోటు ప్రసాద్‌, వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి శీతారామయ్య, కే రాజ్‌ కుమార్‌ మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img