బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్
బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రంతో ప్రకటన చేయించాలని.. అంతవరకు దీక్ష చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు యాసంగి పంట కొనుగోలుపై ప్రకటన చేయించాలన్నారు.లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రాన్ని ఒప్పిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఈ విషయంపై తేల్చి చెప్పాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని మండిపడ్డారు.