భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం తానేనని వనమా రాఘవ పోలీసుల ముందు ఒప్పుకున్నాడని ఏఎస్పీ రోహిత్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిన ఏఎస్పీ..వనమా రాఘవపై ఈ కేసుతోపాటు 12 కేసులు ఉన్నాయని స్పష్టంచేశారు. రామకృష్ణను అరెస్టు చేసిన తర్వాత విచారించామన్నారు. విచారణలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తానే కారణమని రాఘవ ఒప్పుకున్నాడని తెలిపారు. దీంతోపాటు ఇతర కేసులపై కూడా విచారించామన్నారు. చాలా విషయాలు తెలిశాయని, అన్నీ తర్వాత మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. కొద్దిసేపట్లో రాఘవను పోలీసులు కొత్తగూడెం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.