ప్రస్తుతం దేశంలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో తాజాగా ఏవై.4.2 వేరియంట్ కేసులు ఏడు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో కూడా కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ అలజడి సృష్టిస్తోంది. రాష్ట్రంలో రెండు డెల్టా ఏవై కేసులు నమోదయ్యాయంటూ ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో కూడా ఒక ఏవై 4.2 కరోనా వేరియంట్ కేసు నమోదైనట్లు తెలిపింది. అయితే.. ఈ కేసు 2021 జూన్ నెలలో నమోదైందని వెల్లడిరచింది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఏవై 4.2 కేసులు నమోదు కాలేదంటూ స్పష్టంచేసింది.