కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం చట్ట విరుద్దామా..? అని బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత అందరినీ కలిసి వందలాది మందితో మాట్లాడినట్లు చెప్పారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. కిరణ్ కుమార్, వైఎస్, రోశయ్యతోనూ మాట్లాడానన్నారు. రేవంత్ రెడ్డిని కలవడం.. సంస్కార హీనమైతే కాదు కదా అన్నారు. అవేమీ నిషేధించబడ్డ పార్టీలు కాదు కదా అన్నారు. తాను ఇప్పుడు కూడా కలుస్తానని.. తనకు ఆ దమ్ము ఉందన్నారు. పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండాలని..బీజేపీ, కాంగ్రెస్ ఉత్తర దక్షిణ ధృవాలని అవి కలిసే ఆస్కారం లేదని ఈటల పేర్కొన్నారు.