బండి సంజయ్
ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం రాసిన లేఖను సాయంత్రం 5 గంటల లోపు బహిర్గతం చేయాలని, లేకుంటే కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ లేఖ రాస్తే.. కేంద్రాన్ని తాము ఒప్పిస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రులపై చర్యలకు ఈసీని కోరతామన్నారు. వరి కాకుండా ఏ పంట పండిరచాలో ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదని తప్పుబట్టారు. వరి పంట వేయకుంటే లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజక్ట్ ఎందుకు? అని ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చి కేసీఆర్ అన్నీ బంద్ చేస్తున్నారని దుయ్యబట్టారు.