వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.పంట నష్టపోయిన రైతులకు కావాల్సింది మొసలి కన్నీరు కాదని, తక్షణ ఆర్థిక సాయమని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. నర్సంపేట డివిజన్‌లో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. కండితుడుపు చర్యగా మంత్రులు వచ్చారు, వెళ్లారని ఆయన ఆరోపించారు. రైతులకు కావాల్సింది మొసలి కన్నీరు కాదు, తక్షణ ఆర్థిక సాయమన్నారు. కేంద్ర ఫసల్ బీమాను కూడా రాష్ట్రం అమలు చేయడం లేదని ఆరోపించారు.