రేవంత్ రెడ్డి
సిద్దిపేట కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం వరి రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని పేర్కొన్నారు. .‘సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న ఊరుకోనంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఈ ఎత్తుగడ అని చెప్పారు. వరి పంటలు వేయనప్పుడు ఇక లక్షల కోట్లు వ్యయం చేసి ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు ఎందుకని ప్రశ్నించారు.