ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇస్తున్న సర్కార్… కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వదా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బీజేపీకి వర్తించని కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్‌కే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ‘రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా, వారికీ లేని కొవిడ్ మాకే ఉందా?…కాంగ్రెస్‌కు రాష్ట్రంలో, కేంద్రంలో పవర్ లేదని పర్మిషన్ ఇవ్వరా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 120 నుండి 150 మందితో శిక్షణ తరగతులకు అనుమతి కోరితే ఇవ్వలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మీటింగ్‌కు 300 మంది హాజరయ్యారని చెప్పారు. కొవిడ్ నిబంధనలకు లోబడే శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. బీజేపీ నేతలు ఎక్కడా కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని.. దీనిపై డీజీపీ స్పందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.