దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభం
విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యానగర్‌లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమని కొనియాడారు. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని… చికిత్స పేదలకు భారామవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. హెల్త్ రికార్డ్స్ లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన వస్తుందని, అందుకే ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిరచారు. ఆసుపత్రి యాజమాన్యం తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనల అమలుకు ప్రయత్నిస్తామన్నారు.