: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఏపీలో థియేటర్ల సమస్యపై తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని పేర్కొన్నారు. . హైదరాబాద్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని అన్నారు.