తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో గవర్నర్ తమిళ్‌సై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయనకు గవర్నర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ హిమాకోహ్లి ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ ఎం.ఎస్.ఆర్.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పంజాబ్ `హర్యానా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.