మాజీ సీపీ సజ్జనార్ దిశ కేసుకు సంబంధించి రెండవరోజు హైపవర్ కమిషన్ ముందు హాజరయ్యారు. సజ్జనార్ ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని నేడు మరోసారి కమిషన్ ప్రశ్నించనుంది.ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై కమిషన్ విచారణ చేయనుంది. ఇప్పటికే సిట్ ఇంచార్జ్ మహేష్ భగవత్, హోం శాఖ సెక్రెటరీ, బాధిత కుటంబాలు, ప్రత్యక్ష సాక్షులు, డాక్టర్స్, ఫోరెన్సిక్ నిపుణులు, రెవిన్యూ అధికారులను కమిషన్ విచారించింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక సమర్పించనుంది.