Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Saturday, September 28, 2024
Saturday, September 28, 2024

పురాతన కట్టడాలు పరిరక్షిస్తాం

సీఐఐతో ప్రభుత్వం ఒప్పందం
మూసీ ప్రక్షాళనకు నిర్ణయం: రేవంత్‌

విశాలాంధ్ర-హైదరాబాద్‌: మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న అతి పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దత్తత తీసుకోవాలని సీఐఐకి సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని చెప్పారు. దీన్ని గోషామహల్‌ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరముందన్నారు. రాజేంద్రనగర్‌ లో హైకోర్టు నూతన భవనం నిర్మాణం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌ సిటీ కాలేజ్‌ భవనంతో పాటు పురానాపూల్‌ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే చార్మినార్‌ పరిరక్షణ ప్రాజెక్ట్‌ కొనసాగుతోందన్నారు.
పురాతన బావులు దత్తత…
నగరంలో పురాతన మెట్ల బావు లను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎంకు వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా వర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్ఫోసిస్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్‌ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. భారత్‌ బయోటెక్‌ సంస్థ సాలార్‌జంగ్‌, అమ్మపల్లి బావులను పునరుద్దరించనున్నది. అడిక్‌మెట్‌ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌ నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్‌ కాలేజీ పునరుద్దరించనుంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలంగాణ దర్శిని…
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన జీవో జారీ చేశామన్నారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని తీసుకువచ్చినట్లు సీఎం వివరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌, సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌ సాయి ప్రసాద్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img