పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కూనంనేని
విశాలాంధ్ర బ్యూరో-భద్రాద్రి కొత్తగూడెం : దేశవ్యాప్తంగా ఎర్రజెండా పార్టీ … కార్మికులు, కర్షకులు, పేదవర్గాలకు తోడునీడగా నిలిచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజాపక్షం వహిస్తూ బలమైన రాజకీయ శక్తిగా నిలబడిరదన్నారు. పాల్వంచ మండలం ఉల్వనూర్ ఎస్సీ కాలనీ, నరసింహసాగర్ ప్రాంతాలలో సోమవారం కార్యకర్తల సమావేశం జరిగింది. శెట్టి ప్రసాద్, అమృతారావు, మెరుగు రాయలమ్మ, సుగుణ, నరసింహసాగర్, వజ్జా వాసు, కాలం ఎర్రయ్య, నరసింహారావు, రమణమ్మ, కోరం లక్ష్మి, నేతృత్వంలో వివిధ గ్రామాల నుంచి 100 కుటుంబాలు కూనంనేని, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సమక్షంలో సీపీఐలో చేరారు. లక్ష్మీదేవి పల్లి మండలంలోని జయశంకర్ కాలనీకి చెందిన 60 కుటుంబాలు చేరాయి. ఎడ్ల శ్రీనివాస్, బుక్యపార్వతి, శ్యామల, విజయలక్ష్మి, మల్లాది పుల్లయ్య, రావుల నరసయ్య, కురసం కుమార్, ఎర్రయ్య నాయకత్వంలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. వేర్వేరు సభల్లో కూనంనేని మాట్లాడుతూ… గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజకీయాల కతీతంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సమస్యల శాశ్వత పరిస్కారంకోసం కృషి చేస్తున్నామన్నారు. సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటమే ఎర్రజెండా లక్ష్యమన్నారు. ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, చంద్రగిరి శ్రీనివాస్, లగడపాటి రమేష్, మిరియాల రాము, నాగరాజు, డీ సుధాకర్, వెంకట్రావు, మన్నెం వెంకన్న, శ్రీనివాస్ రావు, నాగేశ్వరరావు, వేములపల్లి శ్రీను, దారా శ్రీను, ఎస్కె. లాల్ పాషా, ఉండ్రాతి రవి, ఎస్కె. ఖాసీం, మాజీ సర్పంచ్ కల్తీ రమేష్ పాల్గొన్నారు.