విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం: రేవంత్‌రెడ్డి హైదరాబాద్: ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. నిసీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చివేసింది. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు? నిర్మాణాలకు అధికారులే అనుమతి ఇస్తారుౌ సర్పంచులు కాదని ఆయనకు తెలియదా? దానికి ఎటువంటి అనుమతులు లేవు.. చట్ట ప్రకారం ముందుకు సాగుతాం అని పేర్కొన్నారు రేవంత్..తన కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని ఇందులో ఎటువంటి అనుమానాలు వద్దని చెప్పారు..