జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం
నగరంలోని ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న డిఆర్డిఏ- వెలుగు కార్యాలయంలో అనంతపురం రెవెన్యూ డివిజన్ స్థాయిలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 205 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న మండల స్థాయి అర్జీలను మండల స్థాయిలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారం కోసం ప్రతిరోజు అధికారులు సమయం కేటాయించాలన్నారు. అర్జీదారులు మండల స్థాయిలో తహసీల్దారులను కలిసి సమస్యలు విన్నవించి ఇక్కడికి రావడం జరిగిందని, మండల స్థాయి అధికారులంతా దృష్టి సారించి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అర్జీలను అర్థం చేసుకోవాలని, అర్జీదారునికి ఏం కావాలి అనేది తెలుసుకోవాలని, పరిష్కరించలేకపోతే ఎందుకు సమస్యలు పరిష్కరించలేకపోతున్నారో అర్థమయ్యేలా వారికి వివరంగా చెప్పి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. ప్రతి అధికారి ప్రతి వారంలో వారి పరిధిలో ఎలాంటి అర్జీలు పెండింగ్ ఉన్నాయో చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించి అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా 3వ స్థలంలో ఉందని, రోజురోజుకు అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరుగుతోందని, అది మరింత పెరగాలన్నారు. అర్జీల పరిష్కారంపై జిల్లా, మండల స్థాయి అధికారులంతా సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టాలన్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్, ప్రతి ఆర్డీఓ కార్యాలయం, తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన 100 ముఖ్యమైన సర్వీస్ లకు సంబంధించిన బోర్డులను ప్రదర్శించాలన్నారు. అలాగే నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో, మున్సిపాలిటీ కార్యాలయాలలో ముఖ్యమైన సేవల వివరాలు ప్రదర్శించాలన్నారు. ఏ మండలంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయో ఆ మండలానికి వచ్చేవారం జాయింట్ కలెక్టర్ వెళ్లడం జరుగుతుందని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్జీల పరిష్కారం సిస్టమేటిక్ మ్యానర్ లో జరగాలని ఆదేశించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేయాలని, ఈ విషయమై మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు అంతా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మండల స్థాయిలో ప్రజలకు అవసరమైన ముఖ్యమైన 100 సేవలకు సంబంధించిన బోర్డులను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, డీఆర్డీఏ పిడి మరియు జడ్పి సిఈఓ ఓబులమ్మ, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, సిపిఓ అశోక్ కుమార్, ఎల్డిఎం నర్సింగరావు, డిపిఓ ప్రభాకర్ రావు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, డీఈవో వరలక్ష్మి, డ్వామా పిడి విజయలక్ష్మి, హార్టికల్చర్ డిడి నరసింహారావు, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, చేనేత జౌళి శాఖ ఏడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రామసుబ్బారెడ్డి, ఇంచార్జి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజశేఖర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ నాగరాజు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డిటిసి వీర్రాజు, ఆర్.అండ్.బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సర్వే ఏడి రూప్ల నాయక్, తహసీల్దార్లు మోహన్ రావు, వాణిశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.