విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అందరి సమక్షంలో ఆయా ఈవీఎం గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. డిఫాల్ట్ కలిగిన 41 వీవీఫ్యాట్స్, ఈవీఎంలను మరమ్మతుల కోసం బెంగళూరులోని బెల్ కంపెనీకి తరలించనుండగా, వాటిని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎంఎండి.ఇమామ్, టిడిపి ప్రతినిధి చెరకుతోట పవన్ కుమార్, బిజెపి ప్రతినిధి ఈశ్వర్ ప్రసాద్, వైఎస్సార్సిపి ప్రతినిధి రాధాకృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మసూద్ వలీ, బీఎస్పీ అంజయ్య, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ కనకరాజ్, డిప్యూటీ తహసీల్దార్ దివాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.